వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చొరవ కావాలి: భారత్ సంబంధాలపై హీనా రబ్బానీ ఖర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hina Rabbani Khar
ఫనోమ్‌ఫెన్హ్: భారత్, పాక్ సంబంధాలను పరిపుష్టం చేసుకునేందుకు రెండు వైపుల నుండి చొరవ పెరగాల్సి ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ అన్నారు. ఇందుకు సంబంధించి సరికొత్త పంథాలో ముందుగు సాగాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

అన్ని సమస్యలకూ పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని చెప్పారు. ఇప్పటి వరకు జరిగన ప్రయత్నాలు లక్ష్యాలు చేరుకునే వరకు సాగలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్, పాక్‌లు రెండు విశ్వాసంతో కూడిన సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రెండు దేశాల రాజకీయ నాయకత్వం సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటున్నారని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.

సమీప భవిష్యత్తులో కొన్ని సమస్యలకైనా పరిష్కార మార్గాలు చూపగలమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు గతంలోనీ తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని హీనా చెప్పారు. ఇప్పుడున్న సమస్యలు భవిష్యత్ తరాలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను చిత్తశుద్ధితో చేపట్టవలసి ఉందని చెప్పారు.

ఎస్ఎం కృష్ణ పాక్ పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హీనా రబ్బానీ ఖర్ తెలిపారు. కాగా గత ఏడాది హీనా రబ్బానీ భారత దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం తూర్పు ఏషియా సదస్సులో పాల్గొంటున్నారు.

English summary
Pakistan today said it is willing to go by the agreement that it had in the past with India to resolve some of the disputes like Sir Creek and Siachen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X