వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదవ్ నో: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జశ్వంత్ సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaswant Singh
న్యూఢిల్లీ: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్ సింగ్ బరిలో నిలవనున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని సోమవారం ప్రకటన చేశారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. యుపిఏ అహ్మద్ అన్సారీని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే ముందు తమను సంప్రదించలేదని అద్వానీ అన్నారు.

తొలుత ఎన్డీయే కన్వీనర్, జనతా దళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను బరిలో నిలపాలని బిజెపి సీనియర్లు భావించారని, అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని అద్వానీ తెలిపారు. నేతలంతా జశ్వంత్ సింగ్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. కాగా యుపిఏ అభ్యర్థిగా అహ్మద్ అన్సారీ బరిలో నిలవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా పోటీ తప్పడం లేదు. తనను ఎంపిక చేయడంపై జశ్వంత్ సింగ్ ఎన్డీయేకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రపతి ఎన్నిక ద్వారా ఎన్డియేలో మనస్పర్ధలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్డియే కూటమిలో ప్రధాన పార్టీలైన శివసేన, జెడి(యు) తదితర పార్టీలు యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నాయి. ఎన్డియే అభ్యర్థి పిఏ సంగ్మాకు మద్దతిచ్చేందుకు నిరాకరించాయి.

దానిని పూడ్చుకునేందుకు బిజెపి ఉప రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తుందని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో శివసేన, జెడి(యు)లు జశ్వంత్ సింగ్‌కే మద్దతిచ్చే అవకాశముంది.

English summary
With the UPA coming out with their candidate for the Vice President post namely Hamid Ansari, the NDA has decided to put up a fight and is all set to contest UPA's choice Ansari. According to sources, the NDA is to name senior BJP leader and former Foreign Minister Jaswant Singh as their Vice Presidential nominee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X