వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా సౌర్వభౌమాధికారం: ఒబామాకు ఆనందశర్మ రిప్లై

By Pratap
|
Google Oneindia TeluguNews

Anand Sharma - Obama
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యకు భారత వాణిజ్య, పారిశ్రామిక మంత్రి ఆనంద శర్మ సమాధానం ఇచ్చారు విధాన నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని ఆయన అన్నారు. అమెరికా రక్షణ విధానం నుంచి, వాణిజ్య హద్దుల నుంచి బయటపడాలని ఆయన సోమవారం అన్నారు. భారత్ కఠిన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ఒబామా చేసిన వ్యాఖ్యకు ఆయన సోమవారం ప్రతిస్పందించారు.

తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఉందని, అయితే విధాన నిర్ణయమనేది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వ విధానం పెట్టుబడులకు అనుకూలంగానే ఉందని ఆయన చెప్పారు.

కఠిన ఆర్థిక సంస్కరణలకు భారత్ శ్రీకారం చుట్టాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. రిటైల్ రంగంతో పాటు పలు రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను భారత్ నిషేధిస్తోందని, భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, భారత్-పాక్ సంబంధాలు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై అమెరికా విధానం తదితర అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమెరికా-భారత్ భాగస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న అమెరికన్ వ్యాపారవేత్తలు భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

భారత్ ఆర్థిక వృద్ధి రేటు మందగించడం ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఫలితమేనని ఒబామా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, భారత్ ప్రభావవంతమైన రీతిలోనే వృద్ధి సాధిస్తోందన్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు మంచి మిత్రుడని, పలు అంతర్జాతీయ వేదికల్లో ఆయన వ్యక్తం చేశారు.

English summary
Asserting that policy decision is the "sovereign" right of the country, commerce and industry minister Anand Sharma on Monday said the Barack Obama administration should itself lead fight against protectionism and trade barriers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X