వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నిక: రేపు కాంగ్రెసు ఎమ్మెల్యేల సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress Logo
హైదరాబాద్: ఈ నెల 19వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రేపు (బుధవారం) కాంగ్రెసు శాసనసభ్యుల సమావేశం జరగనుంది. ఓటింగ్ విధానం గురించి ఈ సమావేశంలో శానససభ్యులకు అవగాహన కల్పిస్తారు. నమూనా పోలింగ్ కూడా నిర్వహిస్తారు. ఈ సమావేశం జూబ్లీ హాల్‌లో జరుగుతుందని శాసనసభలో కాంగ్రెసు విప్ ఇ. అనిల్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు

యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ తరఫున ఎన్నికల ఏజెంటుగా నమూనా పోలింగులో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వ్యవహరిస్తారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలని అనిల్ చెప్పారు. కాగా, రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం శానససభ ఆవరణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 294 శానససభ్యులు గల సభలో కాంగ్రెసుకు 155 మంది శాసనసభ్యుల బలం ఉంది. ప్రణబ్ ముఖర్జీకి మజ్లీస్‌కు చెందిన ఏడుగురు శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కానీ ప్రణబ్ ముఖర్జీకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యులున్నారు.

ఇదిలా వుంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తన వైఖరిని వెల్లడించలేదు. తెరాస పోలింగుకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.

English summary
A meeting of the ruling Congress legislators in Andhra Pradesh will be held here tomorrow in a view to acquaint them with the voting procedure for the July 19 Presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X