మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఛార్జీషీట్: ఏ-1 భాను

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఛార్జీషీట్ కోసం సిఐడి పోలీసులు 110 మంది సాక్ష్యులను విచారించారు. భాను కిరణ్‌ను కూడా కస్టడీలోకి తీసుకొని సిఐడి పోలీసులు సమాచారం సేకరించారు. 13 పేజీలతో కూడిన ఛార్జీషీట్‌ను సిఐడి కోర్టులో దాఖలు చేసింది. భాను కిరణ్ పైన మొత్తం 23 కేసులు ఉన్నాయని, మరో ఇరవై రెండు కేసులు పెండింగులో ఉన్నాయని సిఐడి చెబుతోంది.
కాగా సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు మూడు నెలల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు.
తాము పట్టుకున్న ప్రదేశం నుంచి పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత మీడియా ముందు ప్రవేశ పెట్టారు. భాను కిరణ్ మారువేషాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాదు మధ్య తిరుగుతున్న సమయంలో గాలం వేసి పోలీసులు పట్టుకున్నారు. డబ్బుల కోసం తన అనుచరుడు భాను కిరణ్ లేఖలు రాస్తూ వచ్చాడని, ఆ లేఖల ద్వారానే భాను కిరణ్ ఆచూకీ తెలిసింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications