హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఛార్జీషీట్: ఏ-1 భాను

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran-Maddelacheruvu Suri
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో సిఐడి పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జీషీట్‌లో సిఐడి పోలీసులు ఆరుగురు నిందితులను చేర్చారు. ఏ-1గా భాను కిరణ్, ఏ-2గా మన్మోహన్ సింగ్, ఏ-3గా సుబ్బయ్య, ఏ-4గా వెంకటరమణ, ఏ-5గా వెంకట హరిబాబు, ఏ-6గా వంశీధర్ రెడ్డిలను పేర్కొన్నారు. వీరి పైన 302, 201, 202 ఐపిసి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఛార్జీషీట్ కోసం సిఐడి పోలీసులు 110 మంది సాక్ష్యులను విచారించారు. భాను కిరణ్‌ను కూడా కస్టడీలోకి తీసుకొని సిఐడి పోలీసులు సమాచారం సేకరించారు. 13 పేజీలతో కూడిన ఛార్జీషీట్‌ను సిఐడి కోర్టులో దాఖలు చేసింది. భాను కిరణ్ పైన మొత్తం 23 కేసులు ఉన్నాయని, మరో ఇరవై రెండు కేసులు పెండింగులో ఉన్నాయని సిఐడి చెబుతోంది.

కాగా సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు మూడు నెలల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు.

తాము పట్టుకున్న ప్రదేశం నుంచి పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత మీడియా ముందు ప్రవేశ పెట్టారు. భాను కిరణ్ మారువేషాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాదు మధ్య తిరుగుతున్న సమయంలో గాలం వేసి పోలీసులు పట్టుకున్నారు. డబ్బుల కోసం తన అనుచరుడు భాను కిరణ్ లేఖలు రాస్తూ వచ్చాడని, ఆ లేఖల ద్వారానే భాను కిరణ్ ఆచూకీ తెలిసింది.

English summary
CID police filed chargesheet in Maddelacheruvu Suri murder case on Wednesday in Nampally court. The 13 page chargesheet filed before court by CID. CID specified Bhanu Kiran name as A-1 in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X