హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నిక: సిఎల్పీ భేటీకి 13 మంది గైర్హాజర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Komitireddy Venkat Reddy-P Shankar Rao
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బుధవారం హైదరాబాదులోని జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశానికి 13 మంది శానససభ్యులు గైర్హాజరయ్యారు. అయితే, వారంతా కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పలేం. గైర్హాజరైనవారు కూడా ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేసే అవకాశాలున్నాయి. వివిధ కారణాల వల్ల వారు సిఎల్పీ సమావేశానికి రాలేదని తెలుస్తోంది.

పి. శంకరరావు, మర్రి శశిధర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్, మణెమ్మ, వెంకటస్వామి, సతీష్ కుమార్, ఆనం వివేకానంద రెడ్డి, గుప్తా, మోపిదేవి వెంకటరమణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలరాజు సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మార్గనిర్దేశం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహించారు.

గైర్జాజరైనవారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ధ్వజమెత్తుతున్నారు. ఆయన ఆ కారణంగానే ఆయన సమావేశానికి రాలేదని భావించాల్సి ఉంటుంది. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా పేరు పడ్డవారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి తమ సొంత కార్యక్రమాల వల్ల రాలేకపోయి ఉండవచ్చునని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగు జరగదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. క్రాస్ ఓటింగుకు అవకాశాలు లేనట్లుగానే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రేపు గురువారం జరుగుతోంది. ఇందుకు శానససభలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

English summary
13 party MLAs are not attended today's Congress legislature party (CLP) meeting held in the wake of President election. The polling for president election will be held on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X