అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఘోరా సంస్థానం నిర్మిస్తానంటున్న బెంగళూరు బాబా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Aghora Baba
అనంతపురం: జిల్లాలో తాను అఘోరా సంస్థానం నిర్మిస్తానని బెంగళూరుకు చెందిన ఓ అఘోరా బాబా అలియాస్ సాగర్ చెబుతున్నారు. అఘోరాలు అంటే క్షుద్రపూజలు చేసేవారు కాదని ఆయన అంటున్నారు. పుట్టపర్తికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో అఘోరా బాబా సంస్థానాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ టివి ఛానల్‌తో మాట్లాడారు.

అనంతపురంలో సంస్థానం నిర్మించాలనేది తన సంకల్పమని చెప్పారు. దీనికి ఫౌండర్స్, భక్తులు, సేవకులు అంతా ప్రజలే అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్‌మెంట్ కోసమే సంస్థాన నిర్మాణ కార్యక్రమాలు చేపడతున్నారనే ఆరోపణలను అఘోరా బాబా ఖండించారు. కొందరు ఆరోపణలు చేస్తుంటారని, కానీ అవి తప్పన్నారు. ఆరోపణలలో ఎలాంటి నిజం లేదన్నారు. అయినా అలాంటి వారి ఆరోపణలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పారు.

తనకు భక్తులు ఎవరూ ఉండరని చెప్పారు. అందరూ ప్రజా సేవకే ఉంటారన్నారు. తన సేవా గ్రూపులో ప్రముఖులు కూడా ఉంటారన్నారు. ప్రస్తుతం హోమం చేస్తున్నామని, గత ఆదివారం సంకల్పం చేశామన్నారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి సాయి బాబా, కాళేశ్వర బాబాలాగే తాను కూడా సేవ చేస్తానని చెప్పారు.

అఘోరా సంస్థానం అంటే ప్రశాంతతకు మారుపేరు అని తెలియజేస్తానని చెప్పారు. అఘోరా సంస్థానంలో సాయిబాబాకు ఆలయం కట్టిస్తానని చెప్పారు. ఇతను మూడేళ్ల పాటు అఘోరాల వద్ద శిక్షణ తీసుకున్నాడట. కాగా అఘోరా సంస్థాన నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశమైంది.

English summary
Aghora Baba from Bangalore is saying that he will be ready to built Aghora Sasthan near Puttaparthi of Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X