హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నంపై టిడిపి సీరియస్, వేటు యోచన: నానిపై రిపోర్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinnam Ramakotaiah-Kodali Nani
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్యపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఆయనపై వేటు వేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గురువారం జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగుకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ చిన్నం రామకోటయ్య అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు.

మంత్రి పార్థసారథితో కలిసి వచ్చిన ఆయన యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఓటు వేయడంతో ఆలస్యం చేయకుండా ఆయనపై వేటు వేయడమే మంచిదని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే చిన్నం రామకోటయ్య హద్దులు దాటారని, ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని, ఆయనపై వేటు వేయడమే సరైనదని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ఆయనపై ఏ క్షణంలోనైనా వేటు వేసే అవకాశముంది.

గత కొంతకాలంగా ఆయన టిడిపి పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టిక్కెట్ ఇచ్చినా తాను ఆ పార్టీ నుండి పోటీ చేయనని, మరో పార్టీలో చేరతానని చెప్పారు. ఏ పార్టీలో సేవ చేసేందుకు అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీలో చేరుతానని చెప్పారు. పలుమార్లు పార్టీ అధినేత తీరుపై కూడా విమర్శలు గుప్పించారు. నాలుగైదు రోజుల క్రితం చిన్నం ఇక నుండి తాను కాంగ్రెసు సీనియర్ నేత పాలడుగు వెంకట్రావుతో ఉంటానని చెప్పడం ద్వారా కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లు పరోక్షంగా చెప్పేశారు.

ఇంత చేసినా పార్టీ ఆయనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడంతో ఆయనపై వేటు వేయాలని చూస్తోంది. జిల్లా పార్టీ శాఖ కూడా చిన్నం పార్టీని ధిక్కరించడం పైన, గతంలో బాబుపై చేసిన వ్యాఖ్యల పైన అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చింది. అలాగే జగన్‌కు జై కొట్టిన కొడాలి నాని వ్యవహారంపై కూడా నివేదిక ఇచ్చింది.

English summary
It is said that Telugudesam party is ready to take action on Nuziveedu of Krishna district party MLA Chinnam Ramakotaiah for vote in presidential polls on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X