వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగ్మాకు ఓటేసి, సరిదిద్దుకున్న ములాయం సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mulayam Singh Yadav
యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ పొరపాటు చేశారు. యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించిన ఆయన తొలుత సంగ్మాకు ఓటేశారు. అయితే, పొరపాటున సంగ్మాకు ఓటేసిన ములాయం దాన్ని సరిదిద్దుకున్నారు. కొత్త బ్యాలెట్ పేపర్ తీసుకుని ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎకు ములాయం సింగ్ యాదవ్ షాక్ ఇవ్వడం ఇది రెండో సారి.

మొదటి తృణమూల్ కాంగ్రెసు పార్టీతో చేతులు కలిపి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, సోమనాథ్ ఛటర్జీల పేర్లను సూచించారు. ఆ తర్వాత 42 గంటల లోపల తన మనసు మార్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీని కాదని ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పారు.

మరోసారి ములాయం సింగ్ గురువారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా పొరపాటున యుపిఎకు షాక్ ఇచ్చేలా వ్యవహరించారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మరో సంఘటన బిజెపికి వ్యతిరేకంగా జరిగింది. గుజరాత్ బిజెపి శాసనసభ్యుడు కాను కలాసరియా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. బిజెపి సంగ్మాకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) శాసనసభ్యులు 12 మంది ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటింగులో పాల్గొన్నారు.

English summary
What can be more shocking for Pranab Mukherjee that despite being confirmed his support, Samajwadi Party chief Mulayam Singh Yadav cast his vote for PA Sangma. To get the full story, please read on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X