చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగం కోసం సిఎం జయలలిత సంతకం ఫోర్జరీ, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalithaa
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసిన నలభై ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రిన్స్ ఎడ్విన్ అనే వ్యక్తి చెన్నైలోని రాయపేటలో ఓ ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాడు. ఇతను ఉపాధ్యాయ ఉద్యోగం కోసం జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేశాడు.

ఎడ్విన్ ఉద్యోగం కోసం జయలలిత రికమండేషన్‌తో కూడిన లెటర్‌ను డైరెక్టరేట్ ఆఫ్ ఫిజికల్ ఈన్‌స్ట్రక్షన్(డిపిఐ)కు పోస్ట్ చేశాడు. అందులో జయలలిత అతని ఉద్యోగం కోసం ఫేవర్ చేసింది. అందులో తాను కన్యాకుమారికి చెందిన వాడినని రాశాడు.

ఎడ్విన్ పంపిన రికమండేషన్ లెటర్‌కు సంబంధించిన ఓ కాపీని డిపిఐ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి రూఢీ చేసుకునేందుకు పంపించారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది అది ఫేక్ లెటర్‌గా గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఎం సెల్ ఫిర్యాదు మేరకు నుంగంబక్కమ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

వెంటనే పోలీసులు జామ్ బజార్‌లోని గులాం అబ్బాస్ అలీ ఖాన్ నాలుగో వీధిలోని ఎడ్విన్ ఇంట్లో, రాయపేటలోని అతని ప్రింటింగ్ ప్రెస్‌లో సోదాలు చేశారు. పోలీసులు ఫేక్ రబ్బర్ స్టాంప్స్‌, ఓ కంప్యూటర్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గురువారం ఎడ్విన్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత అతనిని పుజాల్ కారాగారానికి తరలించారు.

English summary
Police have arrested a 40-year-old businessman Prince Edwin, who runs a printing press in Royapettah, for forging Tamil Nadu chief minister J Jayalalithaa's signature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X