వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గని శరద్ పవార్: కాంగ్రెస్‌పై ప్రఫుల్ పటెల్ అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Praful fires
న్యూఢిల్లీ: యుపిఏలో సంక్షోభానికి చెక్ పడలేదు. పార్టీ సమావేశం ముగిశాక ఎన్సిపి నేత, మంత్రి ప్రఫుల్ పటేల్ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు నేతలపై ధ్వజమెత్తారు. తమ ప్రధాన దృష్టి 2014 ఎన్నికల పైనే ఉందని చెప్పారు. కొందరు కాంగ్రెసు నేతలు తమపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుపిఏలో ఎన్సిపినే కీలకం అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం నియమాలు పాటించడం లేదని విమర్శించారు. తాము తొలి నుండి యుపిఏలోనే ఉంటున్నామని, ఇక ముందు కూడా ఉంటామని చెప్పారు. తాము రాజీనామాలు చేసింది పదవుల కోసమే అనడం సరికాదన్నారు. అది విషయమే కాదన్నారు. కాంగ్రెసును తాము ఆపద సమయాల్లో పలుమార్లు ఆదుకున్నామని, కాంగ్రెసు తీరులో మార్పు రావాలన్నారు.

బేరసారాల కోసం తాము రాజీనామాలు చేశామని ప్రచారం జరగడం అవాస్తవమన్నారు. ఎంపీల సంఖ్యను బట్టి తమ పార్టీ అధినేత శరద్ పవార్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కాదని, ఆయన చోటా మోటా నేత కాదన్నారు. తాము ఎప్పుడు పదవుల కోసం ఆశపడలేదన్నారు. నెంబర్ టు కోసమో, శాఖల మార్పుల కోసమో తాము పట్టుబట్టడం లేదన్నారు. సంకీర్ణ విలువలు పాటించాలని మాత్రమే కాంగ్రెసుకు సూచిస్తున్నామన్నారు.

తమ ఇబ్బందులను, సమస్యలను పలుమార్లు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ల దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. గురువారం సాయంత్రం కూడా పవార్ ప్రధానితో సమావేశమయ్యారని, ఉదయం సోనియాతో సమావేశమయ్యారని చెప్పారు. సాయంత్రం మరోసారి తమ పార్టీ నేతలం సమావేమయై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

English summary
Central Minister Praful Patel said after NCP party meeting that Congress is not follow coalition rules. He revealed NCP's unhappy about Congress in his press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X