వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ సరే ఒబామా!: టైమ్‌కు ఔట్‌లుక్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అండర్ అచీవర్‌గా పేర్కొంటూ ఓ కథనం రాసిన అమెరికన్ టైమ్ మ్యాగజైన్‌కు మన దేశానికి చెందిన ఔట్‌లుక్ పత్రిక గట్టి కౌంటర్ ఇస్తోంది. రెండు వారాల క్రితం అమెరికన్ మ్యాగజైన్ టైమ్ ప్రధానిని అశక్తుడిగా పేర్కొంటూ ఘాటైన కథనం రాసిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల అమలులో వెనుకబడుతున్నారని టైమ్ తన కథనంలో పేర్కొంది.

Manmohan Singh - Barack Obama

దానికి కౌంటర్‌గా ఓట్‌లుక్ పత్రిక అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాని అండర్ అచీవర్‌గా పేర్కొంది. బరాక్ ఒబామా పరిపాలనను తెగనాడుతూ.. ఆయన ముఖచిత్రంతో ఉన్న ఈ ఔట్‌లుక్ మ్యాగజైన్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. టైమ్ మ్యాగజైన్ మన్మోహన్ ముఖ చిత్రంతో ఎలాగైతే 'ది అండర్‌అచీవర్' హెడ్డింగ్‌తో పుస్తకాన్ని వెలువర్చిందో ఓట్‌లుక్ కూడా ఒబామా ముఖచిత్రంతో 'ది అండర్‌అచీవర్'తో పుస్తకాన్ని అలాగే బయటకు తీసుకు రానుంది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగేళ్ల క్రితం తాను అమెరికాను ప్రగతి పథంలోకి తీసుకు వెళతానని చెప్పి అధికారంలోకి వచ్చాడని, కానీ ఇన్నేళ్ల తన పరిపాలనలో అతను సాధించిందేమీ లేదని పేర్కొంది. ఆయన తెచ్చిన మార్పు ఎవరికీ కనిపించడం లేదని పేర్కొంది. టైమ్ పత్రిక జూలై 7 సంచికలో మన్మోహన్ గురించి కథనం ప్రచురించింది.

English summary

 After some serious bashing by international media over the slow pace of reform, the Prime Minister found two white knights today. First, Ratan Tata tweeted that "Attacks on the architect of 1991 reforms which brought us prosperity is sad and unfortunate. It's wrong to single out the PM for inflation, low investment confidence and slow growth."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X