వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒత్తిడి ఎత్తుగడలుకావు, యుపిఎలో ఉంటాం: ప్రఫుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Praful Patel
ముంబై: తాము ఒత్తిడి ఎత్తుగడలకు పాల్పడడం లేదని ఎన్సీపి నేత, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. తమ పట్ల కాంగ్రెసు అనుసరిస్తున్న వైఖరి తప్ప తీవ్ర నిరసన వ్యక్తం చేసి, యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి ఎన్సీపి సిద్ధపడింది. అయితే, తాము యుపిఎలో కొనసాగుతామని ప్రఫుల్ పటేల్ చెప్పారు ఢిల్లీ నుంచి ఆయన శరద్ పవార్‌తో పాటు ముంబైకి చేరుకున్నారు.

ముంబై విమానాశ్రయంలో ప్రఫుల్ పటేల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్సీపి యుపిఎలో భాగస్వామ్య పక్షమని, భాగస్వామ్య పక్షంగా ఉంటామని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెసుకు విశ్వసనీయమైన మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపి తాము ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని చెప్పడంతో సంక్షోభం ప్రారంభమైంది.

తాము యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో మాట్లాడామని, తాము యుపిఎపై ఒత్తిడి పెడుతున్నామని కాంగ్రెసు సీనియర్ నాయకులెవరూ అనలేదని ప్రఫుల్ పటేల్ అన్నారు. తాము ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నామని కాంగ్రెసు నాయకులెవరైనా అంటే అది సరి కాదని ఆయన అన్నారు.

కాగా, శరద్ పవార్ మీడియాతో మాట్లాడలేదు. శరద్ పవార్‌తో ఎన్సీపి నాయకులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, ప్రఫుల్ పటేల్, ఆర్ పాటిల్ సమావేశమవుతున్నారు. తాము యుపిఎలో ఉంటామని శరద్ పవార్ సోనియాకు రాసిన లేఖలో కూడా స్పష్టం చేశారు. భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెసు సమన్వయంతో వ్యవహరించడం లేదని, భాగస్వామ్య పక్షాలను సంప్రదించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు.

English summary
NCP, which threatened to pull out of the UPA government in protest against the way the party was treated by Congress, Saturday said it will remain an ally of the ruling coalition. Talking to reporters at the city airport after his arrival from Delhi with NCP supremo Sharad Pawar, Praful Patel said, "NCP is part of the UPA and will remain so."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X