వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగుతున్న దూరం: అగాథా సంగ్మా రాజీనామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Agatha Sangma
ముంబై/ న్యూఢిల్లీ: ఎన్సీపికి, కాంగ్రెసుకు మధ్య పెరుగుతున్న దూరం నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి అగాధా సంగ్మా కూడా రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమె సోమవారం ఎన్సీపి అధినేత శరద్ పవార్‌ను కలిశారు. మంత్రి పదవి రాజీనామా చేయాలని, విధులకు హాజరు కావద్దని శరద్ పవార్ ఆమెకు సూచించినట్లు సమాచారం. శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ తమ రాజీనామా లేఖలను ప్రధానికి పంపించిన నేపథ్యంలో అగాధా సంగ్మా కూడా తన రాజీనామా లేఖను పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రులకు ఇచ్చే విందుకు పవార్ హాజరు కాకపోవచ్చునని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి తప్పుకుని యుపిఎకు బయటి నుంచి మద్దతు ఇస్తామని ఆయన చెబుతున్నారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి పవార్ సోమవారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు.

ఢిల్లీలోని మార్పులతో మహారాష్ట్రలోని భాగస్వామ్యం దెబ్బ తినదని శరద్ పవార్ కాంగ్రెసు నాయకులతో చెప్పినట్లు సమాచారం. అన్ని సమస్యలను పరిష్కరించడానికి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కాంగ్రెసు ఎన్సీపి నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఎన్సీపి సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో సమన్వయ కమిటీ లేదని మంత్రులు చెబుతున్నారని, ఇంతకు ముందు కమిటీ ఉండేదని, అయితే అది సమావేశం కాలేదని ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.

ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు ఎన్సీపిని పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ భవన్ కాంట్రాక్టు విషయంలో చవాన్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నీటి పారుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎన్సీపి చేస్తున్న డిమాండ్ కూడా ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేశాయి.

English summary
It is said that Agatha Sangma may resign for her mibistership. NCP supremo Sharad Pawar will not attend a dinner tonight hosted by the Prime Minister for all ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X