వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిఎలోనే ఉంటాం కానీ, ఆ తర్వాతే..: ప్రఫుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Praful Patel
ముంబై: కాంగ్రెసు నాయకులతో రేపు మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ చెప్పారు. పార్టీ సమావేశానంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము యుపిఎలో భాగంగానే ఉంటామని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందే తాము యుపిఎలో భాగస్వామిగా చేరామని, 2014 వరకు యుపిఎలోనే ఉంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు, తమ పార్టీకి మధ్య ఏ విధమైన అభిప్రాయభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ఈ రోజు జరిగిన సమావేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, రేపు గానీ ఎల్లుండి గానీ మరోసారి పార్టీ నేతలతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో కొన్ని సమస్యలున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్రకు చెందిన నాయకులు తమ సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, వారి అభిప్రాయాలు కూడా తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

యుపిఎలో తాము బాధ్యతాయుతమైన భాగస్వామ్య పక్షంగా ఉన్నామని, అలాగే కొనసాగుతామని ఆయన చెప్పారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సజావుగా నడవాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అగాథా సంగ్మా ఇక్కడికి వచ్చారని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారని ఆయన అన్నారు.

తమ అధినేత శరద్ పవార్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అన్ని విషయాలూ చెప్పినట్లు ఆయన తెలిపారు. కొంత మంది కాంగ్రెసు నాయకులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇది కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయకూడదని ఆయన అన్నారు.

English summary
Sharad Pawar and other senior leaders from his party, the Nationalist Congress Party or the NCP, met to decide its stand on its alliance withe the UPA. Union minister Praful Patel spoke to the media after the meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X