హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో అప్పుడే తెగతెంపులు! అతనిది వేరే పార్టీ: వంశీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vamshi Chand Reddy-YS Jagan
హైదరాబాద్: శాసనసభతో సహా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ పార్టీ టిక్కెట్లలో ఇరవై శాతం యువజన కాంగ్రెసులో పని చేస్తున్న వారికి కేటాయిస్తారని తాను ఆశిస్తున్నానని యువజన కాంగ్రెసు నూతన అధ్యక్షుడు చల్లా వంశీ చంద్ రెడ్డి సోమవారం అన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేయాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా యోచిస్తున్నారని చెప్పారు.

భవిష్యత్తులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్ష పదవిని కూడా ఎన్నికల ద్వారా నియమించే యోచన ఉందని చెప్పారు. గతంలో ఎన్ఎస్‌యుఐ, యువజన కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్ష పదవులు నామినేషన్ పద్ధతిలో భర్తీ చేసే వారని, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని ఎన్నికల ద్వారా నియామకాలు జరగాలని రాహుల్ నిర్ణయించారన్నారు. యువజన కాంగ్రెసు ఎన్నికలలో రాష్ట్ర కమిటీ కోసం 26 మంది పోటీ పడగా... తనతో సహా 10 మంది విజయం సాధించారన్నారు.

తన విజయం ప్రతి కార్యకర్త విజయమని వంశీ అన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా ఎన్నికల ద్వారానే నియమించాలని రాహుల్ భావిస్తున్నారన్నారు. తాము ప్రభుత్వానిసి, కార్యకర్తలకు మధ్య వారధిగా పని చేస్తామని వంశీ చెప్పారు. పది రోజుల్లో కొత్త కమిటీ కార్యవర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని వివరించారు.

2014 సార్వత్రిక ఎన్నికలలో యువతకు పెద్ద పీట వేస్తారన్నారు. తాను కరడుగట్టిన కాంగ్రెసు వాదినని, ఓదార్పు యాత్రకు అనుమతించాలని సోనియా గాంధీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినప్పుడే ఆయనకు దూరమయ్యానని చెప్పారు. జగన్ కాంగ్రెసులో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పని చేశానని, ఇప్పుడు ఆయనది వేరే పార్టీ అన్నారు.

ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థలపై దాడులు నిర్వహించాలంటూ ఎస్సెమ్మెస్‌లు ఇచ్చాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికలలో ఇరవై శాతం స్థానాల్ని యువతకే కేటాయించారన్నారు. త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
State Yuvajana Congress president Vamshi Chand Reddy said that he is not YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's aide now. He said he was worked along with YS Jagan when he is in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X