హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వైఖరి తేలిపోయింది: కెటిఆర్, విజయమ్మకు ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

K T Rama Rao
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడంతో ఆ తర్వాత సిరిసిల్ల చేనేత దీక్షల కాంగ్రెసు ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ విమర్శలు చేయక పోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి తేలి పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కె.తారక రామారావులు మంగళవారం వేర్వేరుగా అన్నారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం తెలంగాణపై ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వరంగల్ జిల్లాలో, విజయమ్మకు కరీంనగర్ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భారగా భద్రత ఇచ్చి పర్యటన చేయనిచ్చిందన్నారు. విజయమ్మ తెలంగాణ దండయాత్రకు కాంగ్రెసు ప్రభుత్వం సహకరించిందని విమర్శించారు.

చేనేత దీక్ష అంటూ వచ్చిన విజయమ్మ సిరిసిల్లలో ఏమా మాట్లాడారని ప్రశ్నించారు. అడుగుడుగునా తెలంగాణవాదులు అడ్డుకొని రాష్ట్రంపై స్పష్టమైన వైఖరి చెప్పమని అడిగితే ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు చేసినప్పుడు విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుందని... ఇప్పుడు తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు.

పదివేల మంది పోలీసు పహారాలో విజయమ్మ సిరిసిల్లకు వచ్చి ఏం సాధించారన్నారు. తాము విజయమ్మ రాకను వ్యతిరేకించలేదని పార్టీ వైఖరి చెప్పాక తెలంగాణలో అడుగు పెట్టమని మాత్రమే చెప్పామన్నారు. జగన్ అవినీతిని చట్ట బద్దం చేసేలా, సీమ సంస్కృతిని బట్టబయలు చేసేలా విజయమ్మ పర్యటన చేసినట్లుగా ఉందన్నారు. ఈ సందర్భంగా కెటిఆఱ్ కెటి రామారావు అనే వెబ్ సైట్ ప్రారంభించారు.

జౌళీకి, చేనేతకు కూడా తేడా తెలియని విజయమ్మ చేనేత దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని హరీష్ రావు అన్నారు. జగన్ వస్తాడు, ఉద్దరిస్తాడని చెప్పడం తప్ప విజయమ్మ సిరిసిల్ల దీక్షలో ఏం చెప్పారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయలేదన్నారు. ప్రణబ్‌కు ఓటేయడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ పైన అనుమానాలు వచ్చాయని, దీక్షలో కిరణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించక పోవడం ద్వారా ఆ అనుమానాలు నిజమయ్యాయన్నారు.

English summary
Telangana Rastra Samithi MLAs Kalwakuntla Taraka Rama Rao and Harish Rao fired at YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X