వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలక్ష్మికి మొండిచేయి: ఆ ఐఎఎస్‌లకు న్యాయసాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 వివాదాస్పద జీవోల జారీ విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఎనిమిది ఐఎఎస్ అధికారుల్లో ఏడుగురికి న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

శ్రీలక్ష్మికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయసహాయం అందించడం లేదు. ఏడుగురు ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం న్యాయవాదుల ఫీజులు చెల్లిస్తుంది. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో ఐదుగురికి న్యాయసహాయం అందిస్తూ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణను ప్రభుత్వం సహాయం నుంచి మినహాయించింది.

న్యాయ సహాయం అందుకునే ఐఎఎస్ అధికారుల్లో శామ్యూల్, రత్నప్రభ, మన్మహన్ సింగ్, ఆదిత్యనాథ్, సివిఎస్‌కె శర్మ, ఎస్వీ ప్రసాద్ ఉన్నారు. మంత్రుల్లో కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, జె. గీతా రెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే కొంత మంది మంత్రులను, ఐఎఎస్ అధికారులను విచారించింది. ఇంకా వారిని విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
State Government has decided to extend legal assistance to 7 IAS officers in YS Jagan assets case. Srilakshmi, arrested in Karnataka former minister Gali Janardhan reddy has been excluded from the assistance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X