వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను రాజీ పడ్తా: యుపి సిఎం అఖిలేష్ భార్య డింపుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav-Dimple Yadav
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భార్య, పార్లమెంటు సభ్యురాలు డింపుల్‌తో కలిసి ఢిల్లీలో మంగళవారం ఓ వేదిక మీదికి వచ్చారు. తమ జీవితం, రాజకీయాలు, కుటుంబ, మహిళా వ్యాపారవేత్తలు, మీడియా వంటి విషయాలపై వారిద్దరు తమకు వేసిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. డింపుల్ తన ముగ్గురు పిల్లల గురించి, తమ జీవితం గురించి, తన భర్త గురించి మాట్లాడుతున్నంత సేపు 39 ఏళ్ల అఖిలేష్ యాదవ్‌పైనే అందరి దృష్టి నిలిచింది.

తనను తన భర్త బాగా అర్థం చేసుకుంటారని, అదే సమయంలో తాను కూడా రాజీ పడుతుంటానని డింపుల్ చెప్పారు. ముగ్గురు పిల్లల విషయంలో ఎలా వ్యవహరిస్తారని అడిగినప్పుడు తాము వారిని ఊరికి తీసుకుని వెళ్తామని, స్థానిక పిల్లలతో వారు ఆడుకుంటారని ఆమె చెప్పారు. వెంటనే అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకుని - ఇంటి వద్ద వాళ్లు కార్టూన్లు చూస్తారని, వారి పెంగ్విన్ మెడగాస్కర్ తాను ఎప్పుడూ మిస్ కానని చెప్పారు.

అఖిలేష్ యాదవ్ హిందీలో మాట్లాడడానికి ప్రాధాన్యం ఇవ్వగా, డింపుల్ ఆంగ్లంలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలపై అఖిలేష్ యాదవ్ కఠినమైన ప్రశ్నలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. శాంతిభద్రతలపై, భాఘ్పట్‌లో కుల పంచాయతీపై, విద్యుత్ సమస్యపై ఆయన ప్రశ్నలను ఎదుర్కున్నారు.

జాతీయ స్థాయిలో తమ ప్రాధాన్యాన్ని చాటుకోవడానికి అఖిలేష్ యాదవ్, డింపుల్ ఢిల్లీలో ఒకే చోట కనిపించారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలిపినప్పటి నుంచి వారి ప్రాధాన్యం ఢిల్లీలో పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల పేర్లు మార్చడాన్ని అఖిలేష్ యాదవ్ సమర్థించుకున్నారు.

English summary
UP's first couple Akhilesh Yadav and his lawmaker wife Dimple stamped their presence in the national capital on Tuesday fielding questions about their life, politics and family from women business leaders and the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X