వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీలు నెరవేరుస్తున్నా, ఆల్‌ఖైదా పని ఖతం: ఒబామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: 2008లో తాను ఎన్నికల బరిలోకి దిగిన సందర్భంగా ఉగ్రవాదంపై ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం అన్నారు. తాము ఇచ్చిన హామీ మేరకు ఉగ్రవాదులను పనిపడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ పతనా వస్థకు చేరుకుందని ఒబామా తెలిపారు.

కరడు గట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను నిర్మూలించామని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నిర్మూలించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత నేను ప్రకటించానని, అమెరికా భద్రత కోసం ఏదైనా చేస్తామని చెప్పానని, చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నానని అన్నారు. ఆ తర్వాత మా భాగస్వాములు, మిత్రులతో కలిసి ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

బిన్‌ లాడెన్‌ను తుద ముట్టించామని, అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థ పతనావస్థకు చేరేలా చేయగలిగామన్నారు. విదేశాలతో యుద్ధాలకు సంబంధించి జరుగుతున్న ఒక సదస్సులో ఒబామా ప్రసంగించారు. అఫ్థానిస్థాన్‌లో కూడా తాము చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలను విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో ఉగ్రవాదులో తలపడుతున్న అమెరికా సైన్యం సేవలను ఆయన కొనియాడారు.

తాలిబన్‌లను నిరోధించడంలో అమెరికా సైన్యం ఎనలేని కృషి చేస్తోందన్నారు. అల్‌కాయిదా పని ముగించినా, తాలిబన్‌లను లేకుండా చేసినా ఈ తరహా యుద్ధాలలో తమ పని ముగిసినట్లు కాదని ఒబామా వ్యాఖ్యానించారు. సిరియాలో సంక్షోభాన్ని నివారించి అక్కడి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందిస్తామని ఆయన తెలిపారు.

English summary
Asserting that al Qaeda is on the road to defeat, US President Barack Obama has reminded Americans that before his election in 2008 he had pledged to kill Osama bin Laden and he achieved that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X