వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్‌పై గుర్రు: రాజీనామాకు సిద్ధపడిన ఆజంఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Azam Khan
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కష్టాలు ప్రారంభమైనట్లే ఉంది. మంత్రి ఆజంఖాన్ తాను రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. మీరట్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా తనను తొలగించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన అఖిలేష్ యాదవ్‌కు ఓ లేఖ రాశారు.

మీరట్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా పని చేసే సామర్థ్యం తనకు లేదని భావిస్తే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. ఘజియాబాద్, ముజఫర్ నగర్ జిల్లాలో ఇంచార్జీ బాధ్యతల నుంచి కూడా తనను తప్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

మీరట్ జిల్లా ఇంచార్జీగా పంచాయతీరాజ్ మంత్రి బలరామ్ యాదవ్‌ను నియమిస్తూ ఆజంఖాన్‌కు ఫిలిభిత్ బాధ్యతలు అప్పగించారు. పట్టణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమ మంత్రి ఆజంఖాన్‌కు అఖిలేష్ యాదవ్ ఇంతకు ముందు ఘజియాబాద్, ముజఫర్‌నగర్, మీరట్ జిల్లాల ఇంచార్జీ మంత్రిగా నియమించారు.

నిజానికి, మొదటి నుంచి అఖిలేష్ యాదవ్ పట్ల ఆజంఖాన్ అసంతృప్తిగానే ఉన్నారు. అఖిలేష్ యాదవ్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే విషయంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నచ్చజెప్పడంతో ఆయన అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో చేరారు.

English summary
Samajwadi Party leader Azam Khan offered to resign from the Uttar Pradesh cabinet berth after he was removed as the minister in-charge of Meerut district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X