• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లి చేసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్

By Pratap
|

North Korea Map
ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ వివాహం చేసుకున్నారు. ఆయన రి సోల్‌ జు అనే యువతిని వివాహం చేసుకున్నట్లు ప్రభుత్వ మీడియా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించారు.

కాగా రి సోల్‌ జు వివరాలు కూడా రహస్యంగానే ఉంచారు. ఆమెను మిస్టరీ ఉమెన్‌గా అమెరికాతో పాటు పలు అంతర్జాతీయ దేశాలంటున్నాయి. ఇటీవల జరిగే కార్యక్రమాలకు రి సోల్‌జును వెంటబెట్టుకుని రావడంపై ప్యాంగ్‌యాంగ్‌లో చెవులు కొరుక్కున్నారు. ఇదే పేరుతో ఓ మహిళా గాయని ఉన్నారని, అయితే ఆమె, ఈమె ఒక్కరేనా కాదా అన్నది సందేహాస్పదంగానే ఉంది.

ఉత్తరకొరియా అధ్యక్షుడి వివాహంపై అమెరికా స్పందించింది. పెళ్ళి జరగడం మంచి వార్త అంటూనే ప్రజల కష్టాలు తొలగించే చర్యలు చేపడితే మరింత మంచి వార్త అవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి విక్టోరియా వ్యాఖ్యానించారు. పెళ్ళికి తమకు ఆహ్వానం లేదని నవ్వుతూ అన్నారు.

ఆ యువ మహిళతో కిమ్ జాంగ్ మికీ మౌస్, డిస్నీ లాండ్ వంటి సంగీతోత్సవాల్లో పలు మార్లు కనిపించారు. ఇటీవల ఆ మహిళతో కిమ్ జాంగ్ పలు కార్యక్రమాల్లో దర్శనమిచ్చారు. దీంతో ఆమె ఆయన భార్య అయి ఉంటుందని మీడియా ఊహాగానాలు చేసింది.

English summary

 North Korea said its new, young leader Kim Jong Un is married, announcing it for the first time in a brief and routine state TV report today evening that ends weeks of speculation about a beautiful woman who accompanied him to recent public events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more