వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో ట్రక్, 16 మంది అమర్నాథ్ యాత్రికుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Amaranath Yathra
జమ్మూ: అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్ లోతైన లోయలో పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు.

ట్రక్కులో 16 మంది యాత్రికులు వెనక్కి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి సాంబ జిల్లాలోని మనాసర్ బెల్టులో గల జమూర్హా మోర్హ్ వద్ద లోయలో పడిపోయింది. సంఘటనా స్థలం జమ్మూ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సైన్యం, బిఎస్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన 16 మందిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడ మరణించగా, మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. స్వల్వ గాయాలు అయిన ఇద్దరిని ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జీ చేశారు.

జమ్మూలో అమర్నాథ్ యాత్రలో ఈ నెలలో జరిగిన రెండో అతి పెద్ద ప్రమాదం ఇది. జులై 14వ తేదీ రాత్రి బస్సు లోయలో పడడంతో 15 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై యాత్రికులతో వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.

English summary
Sixteen Amarnath pilgrims were killed and 16 others injured when a truck carrying them plunged into a deep gorge in Samba district of Jammu and Kashmir late last night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X