వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉజ్వలతో ప్రేమాయణం: రోహిత్ శేఖర్ తండ్రి తివారీయే

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: ఉజ్వలశర్మతో రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ నడిపిన వ్యవహారం వల్లనే రోహిత్ శేఖర్ జన్మించినట్లు డిఎన్ఎ నివేదిక బయటపెట్టింది. డిఎన్ఎ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం బయటపెట్టింది. నివేదికను హైకోర్టు రోహిత్‌ శేఖర్‌కు, తివారీ న్యాయవాదులకు అందించింది. ఈ నివేదిక బయటపడకుండా తివారీ తీవ్ర ప్రయత్నాలు చేశారు.

సుదీర్ఘ న్యాయపోరాటం ద్వారా రోహిత్ తల్లి ఉజ్వలశర్మ విజయం సాధించారు. తివారీ ఉజ్వల శర్మతో నడిపిన రాసలీలల కారణంగానే రోహిత్ శేఖర్ పుట్టాడని, రోహిత్ శేఖర్ బయోలాజికల్ ఫాదర్ తివారీయేనని డిఎన్ఎ నివేదిక తేల్చింది. తన బయోలాజికల్ ఫాదర్‌గా తివారీని ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. చివరకు విజయం సాధించారు.

పితృత్వం కేసులో తనపై జరిపిన డిఎన్ఎ పరీక్షల నివేదికను గోప్యంగా ఉంచాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్డీ తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే 32 ఏళ్ల యువకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో 97 ఏళ్ల తివారీ కష్టాల్లో పడ్డారు. కేసు విచారణ లోననే జరగాలని కూడా ఆయన కోరారు. తివారీని తన కన్నతండ్రిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ 2008లో పిటిషన్ దాఖలు చేశారు. తివారీ, రోహిత్, అతని తల్లి ఉజ్వల శర్మ డిఎన్ఎ పరీక్షలు నివేదికను హైదరాబాదుకు చెందిన డిఎన్ఎ ఫింగర్‌ప్రింట్స్, డయాగ్నస్టిక్స్ కేంద్రం ఇటీవల సమర్పించింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో తివారీ మే 29వ తేదీన డెహ్రాడూన్‌లోని తన నివాసంలో రక్త నమూనాలను ఇచ్చారు. అయితే తివారీ విజ్ఞప్తిపై రోహిత్ శేఖర్, ఉజ్వల శర్మ - నివేదికను బహిరంగ పరచాల్సిందేనని కోరారు. తన తల్లి ఉజ్వల శర్మతో సంబంధం వల్లనే తివారీకి తాను పుట్టానని రోహిత్ శేఖర్ వాదిస్తూ వస్తున్నాడు. తాను తివారీకి పుట్టానని రోహిత్ శేఖర్ వాదనలోని నిజాన్ని తెలుసుకోవడానికి రక్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని అదేశించింది.

అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా జాప్యం చేస్తూ వచ్చారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్‌ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు.

English summary
According to Delhi High Court - ND Tiwari DNA test to determine paternity is positive. Earlier, the Delhi high court dismissed veteran Congress leader N D Tiwari's plea that the report of his DNA test be kept confidential till the conclusion of the hearing in a paternity suit filed by Rohit Shekhar, who claims to be his son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X