వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లీలలే తివారీ కొంప ముంచాయి, గవర్నర్‌గిరి అందుకే..

By Pratap
|
Google Oneindia TeluguNews

Rohit Shekhar-ND Tiwari
న్యూఢిల్లీ: రోహిత్ శేఖర్ కేసు 2008 నుంచి నడిచింది. ఎట్టకేలకు రోహిత్ శేఖర్ విజయం సాధించాడు. రోహిత్ శేఖర్ తివారీకే పుట్టాడని డిఎన్ఎ పరీక్షల్లో తేలిన విషయాన్ని వెల్లడించింది. తివారీని తండ్రిగా ప్రకటించడం పట్ల రోహిత్ శేఖర్ ఆనందం వ్యక్తం చశారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు షంషేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ తన తండ్రి తివారీయేనని ఢిల్లీ హైకోర్టులో అప్పట్లో పిటిషన్ వేశారు. తన తల్లి ఉజ్వల సింగ్ తో తివారీకి గల వైవాహికేతర సంబంధంతోనే తాను పుట్టానని రోహిత్ శేఖర్ పిటిషన్ వేశారు. తనను కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించినందు వల్లనే పిటిషన్ వేసినట్లు రోహిత్ శేఖర్ అప్పట్లో చెప్పాడు. తాను గౌరవప్రదమైన కుటుంబానికి చెందినదానినని, తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి అని, అటువంటి సమాచారం వెల్లడించడానికి తెగువ కావాలని, తాను తన కుమారుడు రోహిత్ కు అండగా నిలబడుతున్నానని అప్పట్లో ఉజ్వల సింగ్ అన్నారు. రోహిత్ శేఖర్ డిఎన్ఎ పరీక్షకు అంగీకరిస్తున్నాడని, అయితే తివారీ అందుకు నిరాకరిస్తున్నారని ఆమె చెప్పారు.

రోహిత్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ కోర్టు విచారణ పరిధిని ప్రశ్నించారు. తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నానని, రోహిత్ లక్నోలో పుట్టాడని, అందువల్ల ఢిల్లీలో విచారణ సరైంది కాదని ఆయన వాదించారు. రోహిత్ పిటిషన్ ను కోర్టు ఏప్రిల్ లో విచారణకు స్వీకరించి, తివారీకి నోటీసులు పంపింది. రోహిత్ ను కొడుకుగా తివారీ స్వీకరించాలని అప్పట్లో షంషేర్ సింగ్ అన్నారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి కూడా ఆయన లేఖ రాశారు. ఎన్డీ తివారీ యూత్ కాంగ్రెసు నాయకుడిగా పనిచేసినప్పుడు ఉజ్వలశర్మతో సంబంధాలు ఏర్పడినట్లు చెబుతారు.

సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పదవికి ఎన్డీ తివారీ రాజీనామా తన పదవికి 2009 డిసెంబర్ 26వ తేదీన రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద అంతకు ముందు కేంద్ర హోం శాఖ రాష్ట్రం నుంచి నివేదికను తెప్పించుకుంది. ఆ నివేదిక వచ్చిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేశారు.

ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ రాజభవన్‌లోని సెక్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది. కోర్టు ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ చానెల్ ప్రసారాన్ని ఆపేసింది. రాజభవన్‌లోని రాసలీల దృశ్యాలను ఆ టీవి చానెల్ గంటపాటు ప్రసారం చేసింది. ఆ స్కామ్ వార్తను రాజభవన్ వర్గాలు ఖండించాయి. అయినప్పటికీ తివారీకి పదవీ గండం తప్పలేదు. తివారీ వ్యవహారంపై రాష్ట్రంలోని రాజకీయ పక్షాల నుంచి, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ తాజా పరిణామం నేపథ్యంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్ పర్యటన కూడా అప్పట్లో రద్దయినట్లు ప్రచారం జరిగింది. శీతాకాలం విడిది కోసం ఆమె హైదరాబాద్ రావాల్సి ఉండింది.

గవర్నర్ ఎన్డి తివారీ రాసలీలలను ఆంధ్రజ్యోతి చానల్ రాజీనామాకు ముందు రోజు బయటపెట్టింది. సెక్స్ వర్కర్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించుకుని వారిని రాజ్ భవన్‌లో తోటమాలీలుగా పెట్టుకుని వారితో 85 ఏళ్ల తివారీ రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలను సీక్రెట్ కెమెరాల ద్వారా చిత్రీకరించి ఈ చానల్ బయటపెట్టింది.

English summary
It is happened to ND Tiwari to resign as Andhra Pradesh governor with the controversial act. He resigned to the post after his his sex scam was revealed by a Telugu TV channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X