వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్: నేతల్లో ఒబామా నెం1, మొత్తంగా బ్రిట్నీ తర్వాత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Barack Obama - Britney Spear
జెనీవా: సోషల్ వెబ్ సైట్ ట్విట్టర్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాధి నేతల ట్విట్టర్ వాడకంపై ట్విప్లమసీ అనే పేరుతో నిర్వహించన ఓ సర్వేలో ఆయన 1.7 కోట్ల మంది వీక్షకులతో అగ్రస్థానంలో ఉన్నారు. సర్వేలో 264 ఖాతాలను ట్విప్లమసీ పరిశీలించింది.

సామాజిక మీడియా సర్వీసులోకి ప్రవేశించినప్పటి నుండి బరాక్ ఒబామా దానిని బాగా ఉపయోగిస్తున్నారట. స్వలింగ సంపర్కుల మధ్య వివాహం ఉండాలని ఒబామా పెట్టిన ట్వీట్.. ప్రపంచంలో మరే ఇతర నాయకుడి ట్వీట్ సాధించనంత ప్రజాదరణ పొందింది.

మొత్తం ట్వీటర్ వెర్స్‌లో ఆయన ప్రజాదరణ ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తర్వాత ఐదో స్థానంలో ఉన్నది. ఉగాండా, రువాండా ప్రభుత్వాధినేతల ట్వీట్లలో తొంబై శాతం మేర సమాధానాలే ఉన్నాయి. ట్విట్టర్‌లో ప్రజాధరణ పొందిన నాయకుల్లో రెండో స్థానంలో వెనెజువేలా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ ఉన్నారు. ఆయన 38 శాతం మేర సాధానాలు ఇస్తున్నారు.

తొంబై తొమ్మిది మంది ప్రపంచ నేతలు ఒక్క సమాధానం కూడా తమ ఖాతాదారులకు పంపించలేదు. ట్విట్టర్‌లో 1.7 కోట్ల మంది ఖాతాదారులను కలిగి ఉన్న ఒబామా కేవలం ఒక్క శాతం మందికి మాత్రమే సమాధానాలు ఇస్తున్నారు. కాగా ఈ వివరాలను గురువారం నెట్‌లో పెట్టారు.

English summary

 With more than 17 million followers, BarackObama is by far the most watched of the 264 accounts surveyed in "Twiplomacy," a study of Twitter usage by heads of government, published by public relations firm Burson-Marsteller on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X