శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను స్పోర్ట్స్‌మెన్‌ను, పారిపోను: కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
శ్రీకాకుళం: తాను క్రీడాకారుడిని అని, సమస్యల నుండి పారిపోయే గుణం తనది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఇందిర బాట నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. తాను స్పోర్ట్సుమెన్‌ను అని ప్రజా సమస్యల నుండి పారిపోనని చెప్పారు. వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వం ఉన్నదే అందుకోసమన్నారు.

రాజకీయం కోసమే కొందరు ఆందోళన చేపడుతుంటారని ఎద్దేవా చేశారు. పిటిషన్స్ ఇవ్వడానికి ఓ పద్ధతి ఉందని, ఏం చేసినా ప్రజాస్వామ్యయుతంగా చేయాలని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డిని పలువురు అడ్డుకున్నారు. దానిపై ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. వంశధార నీటి వివాదంపై ఒడిషా ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. ట్రిబ్యునల్‌కు వెళ్లకుండా సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిర బాటకు ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారని, తాము కూడా వారి విశ్వాసాన్ని నిలబెడతామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని పూర్తి చేసుకున్న 71వేల కుటుంబాలకు మరో 50 రోజుల పని కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సంక్షేమ హాస్టళ్లలో బస చేసి అక్కడి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. హాస్టళ్లలో అధికారులు నెలకు ఓసారి రివ్యూ చేస్తారని, ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి సమస్యలను తీసుకు వస్తారన్నారు.

తన పర్యటనలలో హాస్టళ్లలో బస చేస్తున్నానని చెప్పారు. అధికారులు హాస్టళ్లలో బస చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హౌజింగ్ శాఖపై పూర్తిగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు రావాల్సిన రుణాలపై పలు సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy said in his Indira Bata programme that he is not thinking to escape from public issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X