హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజిస్తే కుక్కలు చింపిన విస్తరి: గాదె, రియాక్షనే... జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy - JC Diwakar Reddy
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజిస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి ఆదివారం అన్నారు. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేకాంధ్ర డిమాండ్ల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ను ఛిన్నాభిన్నం చేస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారటం ఖాయమన్నారు. విభజన ప్రధానంగా దేశ సార్వభౌమత్యానికి ప్రమాదకరమని చెప్పారు.

ఎవరెన్ని చెప్పినా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అన్నారు. ఒకరేమో ఉత్తరాంధ్ర, మరొకరేమే రాయలసీమ, మరొకరేమో తెలంగాణ, ఇంకొకరేమో హైదరాబాద్ అంటుంటారని ఇలా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకోవడం సరికాదని ఆయన చెప్పారు. రాయలసీమ నేతలు కూడా సమైక్యాంధ్రకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని, విభజిస్తేనే ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నివేదిక ఇచ్చిందన్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన ప్రత్యేక రాయలసీమ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి స్పందించారు. కేంద్రానికి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయాలన్న తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతల యాక్షన్‌కు రియాక్షనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమ డిమాండ్ అన్నారు.

వర్షాలు పడని పక్షంలో మేఘమథనం చేయాలా వద్దా అని నిర్ణయించాల్సింది తమ పార్టీ అధిష్టానం అన్నారు. అయినా మేఘమథనం చేస్తే ఆ శాఖ మంత్రికి మాత్రమే లాభమని విమర్శలు గుప్పించారు. కాగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి శనివారం రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సి వస్తే మూడుగా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

English summary
Former ministers Gade Venkat Reddy and JC Diwakar Reddy said all seemandhra leaders and people are committed to unted andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X