వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా దీక్ష ప్రారంభం: కేంద్రం సిబిఐని పావుగా... కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: పటిష్ట లోక్‌పాల్ బిల్లు కోసం ప్రముఖ సాంఘీక సంస్కర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం చేపట్టారు. జన్ లోక్‌పాల్ సహా ఇతర అంశాల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి తాము ఇచ్చిన నాలుగు రోజుల అల్టిమేటం ముగియడంతో ఆయన దీక్షకు దిగారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం తాను మరణించే వరకు పోరాడతానని హజారే ఈ సందర్భంగా చెప్పారు.

2014 ఎన్నికల నాటికి కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అన్నారు. తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని, ఎన్నికలలో కూడా పోటీ చేయబోనని మరోసారి చెప్పారు. తన టీమ్ సభ్యులు తన ఆరోగ్యం దృష్ట్యా దీక్ష చేపట్ట వద్దని సూచించిందని, అయితే నాలుగు వందల మంది ప్రజలు దీక్షకు దిగారని, వారిని వదిలేసి తాను దీక్ష చేపట్ట కుండా ఉండలేక పోయానన్నారు.

శనివారం కూడా తన టీమ్ సభ్యులు దీక్ష మానుకోవాలని సూచించారన్నారు. తనకు ప్రజల మద్దతుందన్నారు. తాను జన్ లోక్‌పాల్ బిల్లు తెచ్చే వరకు పోరాటం చేస్తానని, ఈ దేశ ప్రజలు తనను చావనివ్వరన్నారు. దీక్ష ప్రారంభం సందర్భంగా హజారే భారత్ మాతాకీ జై, వందే మాతరమ్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు.

లోకపాల్ బిల్లు పరిధిలోకి సిబిఐని తీసుకు రావాల్సి ఉందని కిరణ్ బేడీ అన్నారు. కేంద్రం సిబిఐను తమ పావుగా ఉపయోగించుకుంటోందని, జన్ లోక్‌పాల్ బిల్లు వచ్చి, దాని పరిధిలోకి సిబిఐ వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు. కాగా అన్నా మరో ముగ్గురు తమ టీమ్ సభ్యులతో కలిసి దీక్షను చేపట్టారు.

English summary
Veteran activist Anna Hazare started his indefinite fast on Sunday, ignoring advices from his team and doctors. He joined other members of his team who have been fasting at the Jantar Mantar since July 25. The 75-year-old, who is leading a fight against corruption in the country, said he was not concerned with the thin crowd at the venue and could continue his protest even with a few people around. Other members of Team Anna, however, were hoping that the number of supporters will only increase after the fasting kicked off officially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X