వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కూచిపూడి' గురువు వెంపటి చిన సత్యం కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vempati Chinna Satyam
చెన్నై: ప్రముఖ కూచిపూటి నాట్య గురువు వెంపటి చిన సత్యం ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎనభై మూడేళ్ల సత్యం అనారోగ్యం కారమంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన 1925 అక్టోబర్ 25న కృష్ణా జిల్లాలోని కూచిపుడిలో జన్మించారు.

కూచిపూడిని సత్యం ప్రపంచవ్యాప్తం చేశారు. రెండు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృష్ణ పారిజాతం, క్షీరసాగర మథనంలు వెంపటి చిన సత్యంగా మంచి పేరు తీసుకు వచ్చాయి. ఈయన కూచిపూడి నృత్యానికే తన జీవితాన్ని అంకితం చేశారు. 1963లో కూచిపూడి ఆర్ట్ అకాడమీని చెన్నైలో స్థాపించారు.

నర్తనశాల సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ బృహన్నల పాత్రకు నృత్య కల్పన చేసి పేరు సంపాదించుకున్నారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని, తెలుగు నటులు ప్రభ, వైజయంతిమాలలకు నాట్య గురువుగా వ్యవహరించారు. ఎన్టీఆర్ తనయ, కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరికి కూడా ఆయన నాట్య గురువు.

కేంద్ర ప్రభుత్వం ఆయనను 1956లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. సంగీత నాటక ఫెల్లో షిప్‌తో 1967లో ఆయనను గౌరవించారు. వీటితో పాటు ఆయన పలు ఆవార్డులు రివార్డులు అందుకున్నారు.

English summary

 Kuchipudi maestro Vempati Chinna Satyam passed away in Chennai following old age related illness on Sunday morning. He was 83.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X