వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ జెడి లక్ష్మినారాయణపై పిటిషన్ కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు సోమవారం కొట్టేసింది. దర్యాప్తు అంశాలను మీడియాకు వెల్లడిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులు, ఎమ్మార్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసుల్లో దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలని కొన్ని మీడియా సంస్థలకు లక్ష్మినారాయణ వెల్లడిస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరుకు చెందిన భవనం భూషణం అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఆ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ విచారణఆర్హం కాదని తేల్చి చెప్పింది. ఇది ప్రజా ప్రయోజనాల కిందికి రాదని స్పష్టం చేసింది. దీనికి తోడు కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను పిటిషనర్‌కు 25 వేల రూపాయల జరిమానాను విధించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో మరో దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్నందున పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మినారాయణపై ఈ నెలారంభంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని, దర్యాఫ్తు సంస్థతో మీడియాకు ఏం సంబంధమని హైకోర్టు ప్రశ్నించింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని కూడా కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ అంశంపై సిబిఐ ఖచ్చితమైన వివరణ ఇవ్వాలని సూచించింది.

మీడియాతో జెడి ఫోన్‌లపై భవనం భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు సిబిఐ జెడికి నోటీసులు జారీ చేసింది. కాగా మీడియాతో మాట్లాడలేదని కోర్టును తప్పుదోవ పట్టించిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన భూషణ్ బి.భవనం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ జెడి ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వివరాలను సమర్పించేలా బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

English summary
High Court quashed the PIL filed by Bhavanam Bhushan against CBI JD Lakshminarayana alleging the media leaks of probe issues. High Court also fined Rs 25 thousnads to Bhushanam for misleading the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X