వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎసిబి ముందు ఎమ్మెల్యే సురేష్ బాబు సరెండర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Karnataka Map
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రం కంప్లి శాసనసభ్యుడు సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ముందు లొంగిపోయినట్లు సమాచారం. ఆయన సోమవారంనాడు ఎసిబి కార్యాలయానికి వచ్చారు. దీంతో ఎసిబి ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. సురేష్ బాబు ఎసిబి కార్యాలయానికి వచ్చిన దృశ్యాలను మీడియా కెమెరామెన్ చిత్రీకరించకుండా అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడు.

గాలి బెయిల్ కుంభకోణం కేసులో కర్ణాటకకు చెందిన శాసనసభ్యులు గాలి సోమశేఖర రెడ్డికి, సురేష్ బాబుకు ఎసిబి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో సురేష్ బాబు ఎసిబి కార్యాలయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సోమశేఖర రెడ్డి, సురేష్‌బాబు విదేశాలకు పారిపోకుండా ఎసిబి ఇది వరకే అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బంధువు, వ్యాపారి దశరథరామిరెడ్డిని ఎసిబి ఇటీవల అరెస్టు చేసింది.

ఈ కేసులో ఇప్పటికే ఎసిబి పలువురిని అరెస్టు చేసింది. దశరథరామిరెడ్డిని ఎసిబి అధికారులు ఆదివారం కోర్టులో హాజరుపర్చింది. దీంతో అతనికి వచ్చే నెల 3వ తేది వరకు రిమాండ్ విధించారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. గాలికి బెయిల్ ఇప్పించేందుకు ఇరవై కోట్లు మాత్రమే కాదని రూ.100 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్లుగా ఇటీవల అరెస్టయిన జిల్లా జడ్జి తన వాంగ్మూలంలో చెప్పారు.

చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు ములాఖత్‌లో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన అనుచరులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇప్పించాలని, ఇంత ఖర్చయినా ఫర్వాలేదని గాలి చెప్పేవాడని తెలుస్తోంది. దాంతో ఈ బాధ్యత ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి, కర్నాటకలోని కంప్లి శాసనసభ్యుడు సురేష్‌లు తమ భుజానికి ఎత్తుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ వెల్లడయిన అంశాల ప్రకారం బెయిల్ కోసం వీరు వేర్వేరు వ్యక్తుల ద్వారా మూడుసార్లు ప్రయత్నాలు చేశారు.

English summary
According to news reports - Karnataka MLA Suresh babu has surrenfered before ACB former minister Gali Janardhan Reddy's bail scam case. Earlier ACB issued notices to Karnataka MLAs Gali Somasekhar Reddy and Sureshbabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X