హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మ ఓదార్పు: జగన్‌పార్టీలో తర్జన భర్జన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - YS Vijayamma
హైదరాబాద్: ఓదార్పు విషయమై వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర తర్జన భర్జన జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి రెండు నెలలు దాటింది. అప్పటి నుండి ఓదార్పు యాత్ర ఆగిపోయింది. ఆయన ఉన్నప్పుడు జిల్లా జిల్లాకు కాస్త గ్యాప్ ఇచ్చి ఓదార్పు యాత్రను నిర్వహించేవారు.

ఆయితే ఆయన అరెస్టుతో ఇది ఆగిపోయింది. దీంతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మచే ఓదార్పు యాత్ర చేపట్ట చేయాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారట. చాలామంది మాత్రం విజయమ్మచే ఈ యాత్ర నిర్వహించడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారట. జగన్ త్వరలో జైలు నుండి బయటకు వస్తారని చెబుతున్నామని... ఇలాంటి సమయంలో విజయమ్మ ఓదార్పు చేపడితే కార్యకర్తలలో జగన్ ఇక త్వరలో బయటకు రాడేమోననే అభిప్రాయం కలిగి.. వారిలో నిరుత్సాహం చోటు చేసుకుంటుందని, తద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారట.

కాస్త ఆలస్యమైనప్పటికీ జగన్ బయటకు వచ్చాకే ఓదార్పు యాత్ర చేపడితే బాగుంటుందని చెబుతున్నారట. ఇడుపులపాయలో ఇచ్చిన మాటకు కట్టుబడి తాను ఓదార్పు నిర్వహిస్తానని జగన్ పలుమార్లు చెప్పినందు వల్ల వారు కూడా జగన్ కోసమే ఎదురు చూస్తారని, ఎప్పుడు వచ్చినా సంతోషిస్తారని చెబుతున్నారట. ఓదార్పును కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని కొందరు సూచిస్తుంటే చాలామంది మాత్రం జగన్ వచ్చాకే అని చెబుతున్నారని తెలుస్తోంది.

విజయమ్మచే ఓదార్పు యాత్ర చేపట్టించే బదులు ప్రజా సమస్యలపై వరుసగా ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు చేయిస్తే బాగుంటుందని పార్టీ నేతలు చెబుతున్నారట. ఓదార్పు యాత్రను జగన్ బయటకు వచ్చే వరకు వాయిదా వేసి, విజయమ్మ సమస్యలపై ఉద్యమిండం ద్వారా పార్టీ ప్రజల్లోకి మరింత వెళుతుందని చెబుతున్నారట. ఇదే విషయమై పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... విజయమ్మ ఓదార్పు యాత్ర చేపట్టడంపై పార్టీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓదార్పు యాత్ర జగన్ చేపట్టే అవకాశాలే ఎక్కువ అని, అవసరమైతే తప్ప విజయమ్మ చేపట్టరని అన్నారు.

English summary
It is said that dilemma in YSR Congress party on party honorary president and Pulivendula MLA YS Vijayamma odarpu yatra due to YS Jaganmohan Reddy jailed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X