హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో కిరణ్‌‌కు స్నేహం! రక్షించేందుకే...: రాఘవులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPM Raghavulu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసు నుండి రక్షించేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులకు న్యాయ సహాయం అందిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సోమవారం అన్నారు. జగన్‌ను రక్షించేందుకు మంత్రులకు వత్తాసా లేక మంత్రులను రక్షించేందుకు జగన్‌ను కూడా బయట పడేయడమా చెప్పాలని ఆయన సిఎంను ప్రశ్నించారు.

జగన్‌కు లబ్ధి చేకూర్చేలా 26 జీవోలు విడుదల చేసిన మంత్రులకు న్యాయ సహాయం అందించడమంటే జగన్‌ను రక్షించే ప్రయత్నంగానే భావించాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే జగన్‌తో స్నేహం కుదిరిందా? లేక చర్యలు చేపట్టడంలో కాళ్లు చాపేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఎద్దేవా చేశారు. మంత్రుల మాట అటుంచి ప్రస్తుతం ప్రభుత్వం మొత్తం అవినీతి మయమైందని, ఇందుకు ముఖ్యమంత్రినే తప్పుబట్టాల్సి ఉందని అన్నారు.

మంత్రి పార్థసారథి నేరస్తుడిగా రుజువైనప్పటికీ రాజీనామా చేయక పోవడం శోచనీయమన్నారు. రాజీనామా చేయక పోవడం పార్థసారథి తప్పు కాదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తొలగించక పోవడమే తప్పన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా ప్రాతిపదికన నిర్వహిస్తామని పదేపదే చెబుతున్న సిఎం ఆ దిశగా చేసిందేమిటని ప్రశ్నించారు.

శ్రీకాకుళంలో ఇందిరమ్మ బాట సందర్భంగా విజ్ఞప్తులను కలెక్టర్‌ ద్వారా మాత్రమే ఇవ్వాలంటూ ప్రజలను కట్టడి చేయడం విడ్డూరమన్నారు. అలా అయితే ఆయన ఇందిర బాటను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సోంపేట, కాకరాపల్లి ప్రజల ఆందోళనను రాజకీయ పోరాటంగా సిఎం అభివర్ణించడం సిగ్గుచేటన్నారు. ఎఫ్ఎస్ఏ పేరిట ప్రజలపై అదనపు భారం మోపబోవడం దారుణమన్నారు. హాస్టళ్లలో ఫైవ్‌స్టార్ హోటల్ వసతులతో బస చేస్తే విద్యార్థుల అగచాట్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

English summary
CPM Raghavulu suspected that CM Kiran Kumar Reddy may allied with YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy to escape from assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X