వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాకు అన్నాహజారే సారీ, సపోర్టర్స్‌కు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ దీక్షా స్థలి వద్ద తమ బృందం సభ్యులు విలేకరులపై దాడికి పాల్పడటంపై దీక్ష చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే మంగళవారం క్షమాపణలు చెప్పారు. దీక్షా వేదిక మీద నుంచి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. దీక్షా సమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరాదని అలా చేస్తే తాను తక్షణం దీక్షను విరమిస్తానని ఆన తన మద్దతుదారులను హెచ్చరించారు.

విలేకరులపై జరిగిన దాడికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇందుకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలను సాకుగా చూపి ప్రభుత్వం రెండు రోజుల్లో దీక్షా శిబిరాన్ని మూయించి వేస్తుందని మద్దతుదారులకు సూచించారు. అవినీతిపై పోరును మీడియాతో కలిసే తాము కొనసాగిస్తామని తెలిపారు. దాడి ఘటనను అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు.

గత రాత్రి జంతర్ మంతర్ వద్ద మీడియాపై అన్నా బృందం దాడిని, వారి వ్యాఖ్యలను బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తమ ఆందోళనను మీడియా సరిగా కవర్ చేయడం లేదంటూ గత రాత్రి అన్నా మద్దతుదారులు మీడియాకు చెందిన ఓ బృందంపై దౌర్జన్యం చేశారు. తాము తమ విధులను సరిగానే నిర్వర్తిస్తున్నామని, అన్నా బృందం తమ నిరంకుశ ప్రవర్తనకుగాను క్షమాపణచెప్పాలని ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దీంతో తగ్గిన అన్నా బృందం క్షమాపణలు చెప్పింది. కాగా అన్నా దీక్ష మంగళవారంతో మూడో రోజుకు చేరుకుంది.

మరోవైపు అవినీతిపై పోరులో భాగంగా దీక్ష చేపట్టేందుకు ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా కోసం రాంలీలా మైదానంలో వేసిన టెంట్ ఈ రోజు కూలిపోయింది. భారీ వర్షం కారణంగా ఈ టెంట్ కూలి నలుగురు కూలీలు గాయపడ్డారు. ఇక్కడి నుంచే ఆగస్టు 9న రాందేవ్ తన దీక్షను ప్రారంభిస్తారు. విదేశాలలోని నల్ల ధనాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆయన దీక్ష చేపట్టనున్నారు.

English summary
Anna Hazare was upset over the scuffle between his supporters and media personnel at Jantar Mantar in New Delhi on Monday, Jul 30. The Gandhian was so upset with his team and other supporters that he threatened to end the protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X