హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లండన్‌వెళ్తే ఒలింపిక్ పతకం వచ్చేది: కిరణ్‌పై నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPI Narayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లండన్ ఒలింపిక్స్‌కు వెళితే పతకం వచ్చేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంగళవారం ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన ముఖ్యమంత్రి... ఇందిర బాటలో రకరకాల ఆటలాడుతూ క్రీడా వినోదంతో కాలం గడిపారని ఆయన మండిపడ్డారు. లండన్ వెళ్లి ఆడితే ఒలింపిక్స్ పతకమైనా వచ్చేది కదా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇందిర బాట అవినీతి మంత్రులను కాపాడే కార్యక్రమమని ధ్వజమెత్తారు. మూడు రోజులపాటు సాగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక మంత్రి జైల్లో ఉంటే మరో ఐదుగురు ఎసిబి విచారణను ఎదుర్కొంటున్నారని, ఇంకొకరికి జైలు శిక్ష పడినా అప్పీలు అవకాశంతో ప్రస్తుతానికి తప్పించుకున్నారని, ఇద్దరు ఐఏఎస్‌లు జైల్లో ఉన్నారని, మరికొందరిపై విచారణ సాగుతోందన్నారు.

అయినా, హత్య చేసిన వారికి మరింత పదునైన కత్తి ఇచ్చినట్లు అవినీతిపరులకు సర్కారు న్యాయ సహాయం అందిస్తోందని మండిపడ్డారు. ఇందిర బాట ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లాలో అక్కడి కొండలు, గుట్టలను కరగదీసిన మంత్రి ధర్మాన ప్రసాద రావును ముఖ్యమంత్రి వెంటేసుకు తిరిగారని ఆరోపించారు.

పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో తీసుకున్న తీర్మానాల్లో భాగంగా వచ్చేనెల 21 నుంచి 31 వరకు తెలంగాణ సాధనపై ప్రచారం చేస్తామన్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్ మాట నిజమైతే ఆయన నోట్లో చక్కెర పోస్తామని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. ఇక సెప్టెంబర్ 17న విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

English summary
CPI state secretary Narayana said that India will get Olympic medal if CM Kiran Kumar Reddy participate in London olympics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X