హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెడి కాల్‌లిస్ట్: సాక్షి విలేకరికి బెయిల్, లొంగిపోవాల్సిందే

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ కాల్ లిస్ట్ వ్యవహారంలో సామాజిక కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాల ఫోన్ కాల్ డేటాను మీడియాకు వెల్లడించిన కేసులో నిందితుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాకు చెందిన విలేకరి యాదగిరి రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ముందస్తు బెయిల్ కోసం యాదగిరి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు విచారణ చేపట్టారు. చంద్రబాల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసిన నేరారోపణలు తీవ్రమైనవని, హేయమైనవి కానందున.. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కేసులో పలుకుబడి గల వ్యక్తుల పేర్లు ఉన్నంత మాత్రాన న్యాయవ్యవహారాల్లో దాని ప్రభావమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఆగస్టు 14వ తేదిలోగా హైదరాబాద్ ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు.

రూ.10వేల బాండ్, ఇద్దరి పూచికత్తులు ఆ కోర్టుకు సమర్పించి బెయిల్ పొందాలని పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ కేసులో దర్యాఫ్తు అధికారి ఎవరైనా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేస్తే, తదుపరి విచారణకు సహకరించాలని షరతు విధించారు.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's Sakshi media reporter Yadagiri Reddy get anticipatory bail on Tuesday from High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X