హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Neelima
హైదరాబాద్: ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. నీలిమ అనే యువతి హైదరాబాదులోని గచ్చీబౌలిలో ఉన్న ఇన్ఫోసిస్‌లో సాఫ్టువేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. గత రాత్రి భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందింది. ఓ ప్రాజెక్టు పని మీద గత మార్చిలో ఆమె అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మరణానికి గల కారణం తెలియరాలేదు.

మరోవైపు తమ కూతురు నీలిమది ఆత్మహత్య కాదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. నీలిమ ఆత్మహత్య చేసుకునే రకం కాదని, దీనిపై దర్యాఫ్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాత్రి జరిగితే తమకు యాజమాన్యం సమాచారమందించలేదని వారు ఆరోపిస్తున్నారు. తమ కూతురు ధైర్యం గలదని, ఏం జరిగినా ఆఫీసు వల్లే అన్నారు. పోలీసులు ఆత్మహత్య కోణంలో హత్య కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నారు. తన కూతురు మరణంపై నీలిమ తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని హత్య చేశారని ఆమె ఆ ఫిర్యాదులో ఆరోపించారు. నీలిమ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కరెంట్ షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం జిల్లాలోని ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులు ఇద్దరూ మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా షాక్ కొట్టి భార్య మృతి చెందగా ఆమెను కాపాడబోయి భర్త కూడా మృత్యువాత పడ్డాడు.

గద్వాలలో పట్ట పగలే దారుణ హత్య

మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పట్టణంలో పట్టపగలే బుధవారం దారుణ హత్య జరిగింది. ఓ కేసు నిమిత్తమై కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తిమ్మప్ప అనే వ్యక్తిని ప్రత్యర్థులు వెంటాడి దారుణంగా నరికి చంపారు. మృతుడు తిమ్మప్ప వడ్డేపల్లి మండలానికి చెందిన సనగల గ్రామానికి చెందిన వ్యక్తి.

English summary
A Woman Infosys Employee has died after she fell from her office building in Hyderabad on Monday night. A probe is on to investigate whether she committed suicide, was murdered or was killed accidentally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X