వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి కాకముందే కలిసున్నారని యువజంట దారుణహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bamako City
బమాకో: ఉత్తర మాలిలో పెళ్లి కాకుండా కలిసి ఉంటున్న ఒక జంటను అల్ కాయిదాతో సంబంధమున్న ఇస్లాం ఛాందసవాదులు రాళ్లలో కొట్టి చంపేశారు. దీనిని ఈ ప్రాంతంలో షరియా చట్టం ప్రకారం విధించిన మొట్టమొదటి మరణశిక్షగా భావిస్తున్నారు. ఆల్జీరియా సరిహద్దుల్లో కిడాల్ ప్రాంతంలోని అగుయెల్‌హోక్ అనే పట్టణంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

రాళ్ల దెబ్బలకు ఆ మహిళ కొద్దిసేపటికే సొమ్మసిల్లగా, కొంచెం సేపు కేకలు పెట్టి ఆ యువకుడు కూడా సృహ తప్పాడని ఆయన వెల్లడించారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఉత్తర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇస్లాం ఛాందసవాదులు మాలి తాత్కాలిక ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.

ఆ జంట మృతదేహాలు వారి మెడ వరకు కాలి ఉన్నాయి. దుండగులు ఆ జంటను అగ్యూలోక్‌ నగరం మధ్యలోకి లాక్కొచ్చారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఓ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు. వారిని రాళ్లతో కొట్టి చంపారని, ఇది చాలా భయంకరమైన చర్య అని అతను పేర్కొన్నాడు.

దాడి జరుగుతుండగా ఆ యువతి ఏడుస్తుండగా, యువకుడు అరిచాడని, ఇది మానవత్వం లేని చర్య అని, వారిని జంతువుల్లా చంపారని చెప్పాడు. వందలమంది ఉండగా వారిని చంపేశారని ఆతను చెప్పాడు.

English summary
Two young, unmarried lovers, apparently with children, were buried up to their necks then stoned to death in a Mali town taken over by extremists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X