హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుతో జగన్‌కు పని లేదు: సబ్బం, జైల్లో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
హైదరాబాద్: కాంగ్రెసుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు పని లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. కాంగ్రెసుకే జగన్ అవసరం ఉంటుందని ఆయన అన్నారు. ఆయన గురువారం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో జగన్‌ను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసుతో జగన్ కలుస్తారనే పుకార్లను నమ్మవద్దని ఆయన అన్నారు. సబ్బం హరి కాంగ్రెసులోనే ఉంటూ వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతి గురువారం ములాఖత్ సమయంలో కలిశారు. సోదరి షర్మిల కూడా జగన్‌ను కలిసి జైలులోనే అతనికి రాఖీ కట్టింది.

ఇదిలా వుంటే, జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురువారం సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన తర్వాత మోపిదేవి మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కాగా, చంచల్‌గుడా జైలులో రక్షాబందన్ వేడుకలు జరిగాయి. విఐపి అండర్ ట్రయల్ ఖైదీలంతా చంచల్‌గుడా జైలులోనే ఉన్నారు. జైల్లో ఉన్న ఖైదీలకు వారి బంధువులు రాఖీలు కట్టారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజాహిత బ్రహ్మకుమారీలు కూడా ఖైదీలకు రాఖీలు కట్టారు.

English summary
Congress rebel MP Sabbam Hari said that YSR Congress party president YS Jagan has not in need of Congress, Congress needs Jagan. He met YS Jagan today at Chanchalguda jail of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X