హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆచార్యకు చుక్కెదురు: జైల్లో జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - BP Acharya
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో మూడో నిందితుడు బిపి ఆచార్యకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురు అయింది. తనకు బెయిల్ ఇవ్వాలన్న ఆచార్య పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టి వేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా బిపి ఆచార్య గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ అనంతరం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతి గురువారం ములాఖత్ సమయంలో కలిశారు. సోదరి షర్మిల కూడా జగన్‌ను కలిసి జైలులోనే అతనికి రాఖీ కట్టింది.

కోనేరుకు బెయిల్

ఎమ్మార్ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్‌కు గురువారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల సొంత పూచికత్తుతో పాటు, రాష్ట్రం విడిచి వెళ్లవద్దని, విచారణకు అందుబాటులో ఉండాలని, పాసుపోర్టు సరెండర్ చేయాలనే షరతులతో బెయిల్ ఇచ్చింది. గత తొమ్మిది నెలలుగా ప్రసాద్ జైలులో ఉంటున్నాడు.

కాగా అక్రమాస్తుల కేసులో జగన్, ఓఎంసి కేసులో బిపి ఆచార్యలను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసు, ఓఎంసితో పాటు ఎమ్మార్ తదితర కేసులను జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిబిఐ విచారిస్తోంది. ఓఎంసి కేసులో బిపి ఆచార్య, శ్రీలక్ష్మి, గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు అరెస్టు కాగా జగన్ కేసులో వైయస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకట రమణలను అరెస్టు చేశారు.

English summary
State High Court dismissed BP Acharya's bail petition on Thursday. YSR Congress honorary president YS Vijayamma and Bharathi met YS Jaganmohan Reddy in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X