హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను, మీరు కాదు: నరసింహన్, సిఎంకు సబిత రాఖీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేను, మీరు అనే భావం విడిచి పెట్టి మనం, మన సమాజం అనే భావనతో ప్రజలు మెలగాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం అన్నారు. రాజ్ భవనంలో రక్షా బంధన్ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. పలువురు పాఠశాల విద్యార్థులు, పలు స్వచ్చంధ సంస్థల మహిళలు వచ్చి గవర్నర్‌కు రాఖీ కట్టారు. ఆయన రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Kiran Kumar Reddy-Sabitha Indra Reddy-Narasimhan

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల్లో నేను, మీరు అనే బేధాలు తొలగి పోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రక్షా బంధన్ ఓ ఆత్మీయ పండుగ అన్నారు. పరస్పర సహాయ సహకారాలతో దేశాన్ని కాపాడుకోగల్గుతామని సూచించారు. ఆత్మీయతతో దేశాన్ని కాపాడుకుందామన్నారు. ప్రజలందరు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయకు గవర్నర్ సతీమణి రాఖీ కట్టారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మహిళా మంత్రులు రాఖీ కట్టారు. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునితా రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి తదితరులు కిరణ్‌కు రాఖీ కట్టారు. పలువురు విద్యార్థులు, మహిళలు కూడా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కిరణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

చిన్నారులు, మహిళలు వచ్చి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాఖీని కట్టారు. బాలు అనే అభిమాని 666 అడుగుల రాఖీని తయారు చేసి తీసుకు వచ్చారు. దానిని తీసుకు వచ్చిన బాలును, ఇతర చిన్నారులను బాబు ఈ సందర్భంగా అభినందించారు.

సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామా రావుకు ఆయన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.

English summary
Ministers Sabitha Indra Reddy and Sunitha Reddy tied up Rakhi to CM Kiran Kumar Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X