వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ పార్టీ పెడతారని ముందే ఊహించాం: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని ముందే ఊహించామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు శుక్రవారం అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నా హజారే వెనుక భారతీయ జనతా పార్టీ హస్తముందని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి రావడానికి అన్నా హజారేను ఉపయోగించుకుంటుందని అన్నారు.

అవినీతిని నివారించే శక్తి ఒక కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఇప్పటికే అవినీతిపరులను జైలుకు పంపించిందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తే సొంత పార్టీ నేతలను కూడా కాంగ్రెసు విస్మరించలేదన్నారు. అనేక మందిపై అరోపణలు వస్తే జైలుకు పంపించిందని చెప్పారు.

అన్నా హజారే బృందం దారి తప్పుతోందని శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు వేరుగా అన్నారు. లోకపాల్ బిల్లుకు పరిష్కారం చూపకుండా రాజకీయ పార్టీ ఆలోచన సరికాదన్నారు. ఉద్యమాన్ని కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా అవినీతిపై నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే రాజకీయ పార్టీ పెట్టడం తప్పేమీ కాదని గురువారం చెప్పిన విషయం తెలిసిందే.

దీక్ష విరమించనున్న హజారే

అవినీతి నిర్మూలించేందుకు జన్ లోకపాల్ బిల్లుపై కేంద్రం నుండి స్పష్టమైన హామీ కోరుతూ ఆదివారం దీక్ష చేపట్టిన అన్నా హజారే నిరసన శుక్రవారంతో ఆరవ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన దీక్ష విరమించనున్నారు.

English summary

 Congress party senior leader and Rajyasabha Member V Hanumantha Rao responded on Anna Hazare's political party statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X