నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు మహిళలపై కత్తి పట్టుకు తిరుగుతున్న సైకో దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: ఇద్దరు మహిళలపై కత్తి పట్టుకొని ఉన్న వ్యక్తి దాడి చేసిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో ఓ వ్యక్తి రాత్రి పూట కత్తి పట్టుకొని అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి చొచ్చుకొని వచ్చాడు. ఎవరో తెలుసుకునే ఆస్కారం ఇవ్వకుండానే సదరు వ్యక్తి మహిళపై దాడి చేసే ప్రయత్నం చేశాడు.

వెంటనే అప్రమత్తమైన అనీల్ కుటుంబ సభ్యులు అతనిని అడ్డుకున్నారు. ఆ తర్వాత మరో మహిళ పైన కూడా దాడి చేసినట్లు చెబుతున్నారు. ఇది సైకో పనే కావొచ్చునని అనుమానిస్తున్నారు. అయితే గతంలో నాలుగు జిల్లాలను వణికించి పోలీసుల కన్నుగప్పి పారిపోయిన సైకో సాంబ పని మాత్రం కాదని చెబుతున్నారు. అతని ఆనవాళ్లు తాజాగా దాడి చేసిన వ్యక్తిలో లేవని చెబుతున్నారు. అలాగే కేరళ నర హంతకుడు ఆంటోనీ గుర్తులు కూడా లేవని చెబుతున్నారు.

దీంతో నెల్లూరులో అంటోనీ కాకుండా మరో సైకో తిరుగుతున్నాడా అనే చర్చ ప్రారంభమైంది. కాగా నాలుగు జిల్లాలను వణికించిన సైకో సాంబశివ రావును గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. అయితే ఆ తర్వాత అతను పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఎక్కడ సైకో అటాక్ జరిగినా సాంబ వైపు వేళ్లూ చూపిస్తున్నారు.

ఇటీవల నెల్లూరు జిల్లాలో బస్సులోనే ముగ్గురిని హత్య చేసిన ఘటనలోనూ తొలుత సైకో సాంబను, ఆ తర్వాత ఆంటోనీని కూడా అనుమానించారు. కానీ ఆ తర్వాత ఈ ఘటనలో సాంబశివ రావు పాత్ర లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

English summary
A psycho has attacked on two woman in SPS Nellore district on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X