హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య కోణం వెనక్కి: టెక్కీ నీలిమది ఆత్మహత్యే, కానీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Neelima
హైదరాబాద్: ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ మృతి కేసులో మిస్టరీ దాదాపు వీడినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఇది హత్యగా అందరూ అనుమానించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం ఇది ఆత్మహత్యగా తేలింది. అదే సమయంలో ఆమెది బలవంతపు ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె బలవంతపు ఆత్మహత్య వెనుక గల కారణాలు ఏమిటో పోలీసులు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

నీలిమది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఆమె కాల్ డేటాను, ఈమెయిల్స్‌ను పోలీసులు పరిశీలించారు. వీటి ఆధారంగా ఆమెది ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతికి ముందు ఆమె తన స్నేహితులకు మెసేజ్‌లు, మెయిల్స్ చేసింది. వీలైతే తాను మరో జన్మలో కలుస్తానని వారికి నీలిమ సమాచారం పంపించింది. దీంతో ఆమెది ముమ్మాటికి ఆత్మహత్యగా భావిస్తున్నారు.

మూడు రోజుల క్రితం నీలిమ ఇన్ఫోసిస్ భవనం పదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకుందని సంస్థ చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, అంత పిరికి వ్యక్తి కాదని చెబుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో గాంధీ వైద్యులు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసి నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదికలో మాత్రం ఆత్మహత్య చేసుకున్న ఆధారాలు లేవని, అయితే వాటిని నిర్ధారించాల్సిందిగా ఫోరెన్సిక్ నిపుణులను వైద్యులు కోరారు. పోలీసుల విచారణలో మాత్రం బలవంతపు ఆత్మహత్యగా ప్రాథమిక విచారణలో తేలింది.

English summary
Police found in their primary investigation that infosys techie Neelima was committed suicide but it is forceful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X