వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ పార్టీ వస్తుంది, నేను పోటీ చేయను: అన్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: కొత్త రాజకీయ పార్టీని సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు. రాజకీయ పార్టీ ప్రజల పార్టీ అని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్ష విరమించడానికి ముందు శుక్రవారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. పార్టీ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, దీనికి అధిష్టానం ఉండదని ఆయన అన్నారు. తాను ఎన్నికల్లో పాల్గొనబోనని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు.

అన్నా హజారే నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ రానుంది. ఈ విషయాన్ని అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరంలో ప్రసంగిస్తూ శుక్రవారం చెప్పారు. పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లు పెడితే రాజకీయాలకు స్వస్తి చెబుతామని ఆయన అన్నారు. గత పది రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. అన్నా హజారే ఆదివారంనాడు దీక్షలో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని వీధుల నుంచి పార్లమెంటులోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా, బయటా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ధనం వద్దు, జనం మద్దతు చాలునని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలుపు ముఖ్యం కాదని, రాజకీయ ప్రక్షాళన అవసరమని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలో భారత్ మారుతుందని ఆయన అన్నారు. తమ పార్టీకి పేరును సూచించాలని ఆయన ప్రజలను కోరారు. గెలిచిన నాయకులు అవినీతికి పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.

రాజకీయాల్లోకి రావాలనే ప్రేమ తమకు ఏమీ లేదని, ఆయితే తప్పని స్థితిలోనే వస్తున్నామని, తమ పార్టీ ఎజెండాను ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తాము గెలవాలనే తాపత్రయంతో రావడం లేదని, ఇతర పార్టీలను సవాల్ చేస్తామని ఆయన అన్నారు. తమకు వచ్చే విరాళాల సమాచారాన్ని వెబ్‌సైట్లో పెడుతామని ఆయన చెప్పారు.

English summary
Anna Hazare says he will not content elections but will support the party from outside. Arvind Kejriwal asked people for their suggestions for the name of the new political party. Kejriwal also urged people to suggest ways to ensure than once elected, the representatives will not become corrupt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X