విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి కన్నా తొందరగానే జగన్: ఎర్రంనాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
విజయవాడ/ హైదరాబాద్: పార్టీని కాంగ్రెసులో పార్టీలో కలిపేయడానికి చిరంజీవికి పట్టినంత సమయం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పట్టదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె. ఎర్రంనాయుడు అన్నారు. ఢిల్లీలో మంతనాలు జరిగిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వింత ధోరణ కనిపిస్తోందని ఆయన శనివారం విజయవాడలో మీడియా ప్రతనిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్సించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్‌కు బెయిల్ కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఒప్పందం జరిగిన తర్వాత సిబిఐ దర్యాప్తులో వేగం తగ్గిందని ఆయన అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని, తమ పార్టీని అంతం చేయడానికి ఆ పార్టీలు మూడు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసుతో తెరాసకు కూడా అవగాహన ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకే చెట్టు కొమ్మలని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే వైయస్ జగన్ పార్టీని స్థాపించారని ఆయన అన్నారు. సోనియా గాంధీ కూడా జైలుకు వెళ్లే రోజు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

English summary
Telugudesam senior leader K Yerram Naidu said that YS Jagan will not take much time to merge his YSR Congress party in Congress. He saif that he even will not take the time taken by Chiranjeevi to merge his Prajarajyam party in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X