వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్ ప్రకంపనలు: ఢిల్లీకి పంచాయతీ, వెళ్లనున్న కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: గ్యాస్ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇక్కడి గ్యాస్‌ను మహారాష్ట్ర ప్రాజెక్టుకు కేటాయించడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో అధికారులు గ్యాస్ మళ్లింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు పంపించడం వల్ల ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మరింత ఇక్కట్లలోకి నెట్టి వేయబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సాహు, ట్రాన్సుకో సిఎండి హీరాలాల్ పాల్గొన్నారు.

పలువురు అధికారులు రాష్ట్ర అవసరాలకు సరిపడా గ్యాస్‌ను కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కిరణ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో గ్యాస్‌ను కేటాయించాలని ప్రధానికి మరో లేఖ రాసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే సమయంలో గ్యాస్ కొరతపై ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లేందుకు కిరణ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందు కోసం ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంట్ కోరారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధానితో కిరణ్ గ్యాస్ కొరత వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పనున్నారు.

కాగా మహారాష్ట్రకు గ్యాస్ తరలించడంపై సిపిఐ నారాయణ విజయవాడలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మేలు చేసే విషయంలో కిరణ్, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిలు విఫలమయ్యారన్నారు. గ్యాస్ తరలింపు విషయంపై చర్చించేందుకు రేపు హైదరాబాదులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం లెనిన్ సెంటర్‌లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు.

English summary
Chief Minister Kiran Kumar Reddy is going to New Delhi on Monday to solve gas crisis in the state. He would be appealed PM Manmohan Singh to allot gas to state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X