హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో పేలుడు కలకలం, నలుగురికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసారి బాంబు కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి బాంబు కాదని సాధారణ పేలుడు అని నిర్ధారించారు. సోమవారం ఉదయం బేగంబజార్‌లో హఠాత్తుగా పేలుడు శబ్దం వినిపించింది. ఈ పేలుడు వినగానే స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికిలు వెంటనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటన సాయినాథ్ గ్లాస్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్యాడ్ తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

చిత్తూరులో అగ్ని ప్రమాదం

మరోవైపు చిత్తూరు జిల్లా వుత్తూరు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సర్క్యూట్ బోర్డు, స్టార్ రూమ్ తీగలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి.

ఇదే జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం నెలవాయిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. కొందరు దుండగులు విక్టోరియా ప్లాస్టిక్ కంపెనీకి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 20 లక్షల రూపాయల నష్టం జరిగినట్లుగా అంచనా.

English summary

 Blast occured at a glass factory in Begumbazar of Hyderabad on Monday morning. In this blast four people injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X